రైతుల నుంచి మట్టి నమూనాలు సేకరణ
AKP: ఎలమంచిలి మండల పరిధిలో 746 మంది నుంచి మట్టి నమూనాలను సేకరించినట్లు జిల్లా వనరుల వ్యవసాయ అధికారిణి విజేత, మండల వ్యవసాయ అధికారి మోహన్ రావు తెలిపారు. శుక్రవారం షేకిళ్లపాలెం రైతు సేవా కేంద్రంలో భూసార పరీక్షలపై అవగాహన కల్పించారు. రైతులు భూసారాన్ని పరిరక్షించుకోవాలన్నారు. రసాయనిక వాడకాన్ని తగ్గించి ఆర్గానిక్ ఎరువుల వినియోగాన్ని పెంచాలన్నారు.