VIDEO: నర్సీపట్నంలో వీధి కుక్కల స్వైర విహారం

VIDEO: నర్సీపట్నంలో వీధి కుక్కల స్వైర విహారం

AKP: నర్సీపట్నంలో రోజురోజుకు వీధి కుక్కల స్వైర విహారం ఎక్కువవుతుంది. గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సైతం కౌన్సిలర్లు వీధికుక్కలపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ జంపా సురేంద్ర సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే సుమారు 800 కుక్కలకు పైగా శస్త్ర చికిత్సలు చేశామని ఆయన తెలిపారు.