ఇకపై కౌంటర్ బుకింగ్స్‌కూ ఓటీపీ!
తత్కాల్ టికెట్లకు సంబంధించి రైల్వే శాఖ మరో మార్పుకు శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తీసుకునే తత్కాల్ టికెట్లకు OTPని తప్పనిసరి చేయనుంది. NOV 17 నుంచి కొన్ని రిజర్వేషన్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా OTP విధానాన్ని అమలు చేయగా విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం 50 చోట్ల ఉన్న ఈ విధానాన్ని అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకు విస్తరించనుంది.