సూర్యాపేట 27వ వార్డులో ఘనంగా హోళీ వేడుకలు

సూర్యాపేట 27వ వార్డులో ఘనంగా హోళీ వేడుకలు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో హోళీ వేడుకలు అంబరాన్నంటాయి. వార్డు కౌన్సిలర్ లక్ష్మీ కాంతమ్మ స్థానిక ప్రజలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వయంగా వార్డు ప్రజల మధ్యకు వచ్చి, అందరికీ రంగులు పూసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. హోళీ రంగుల పండుగ అని, ఈ రంగుల వలె ప్రజలందరి జీవితాలు సుఖసంతోషాలతో నిండాలని ఆకాంక్షించారు.