కోర్టు ఇంజెక్షన్ భూమిలో హంగామా

కృష్ణా: మోపిదేవి (M) పెదప్రోలు చైతన్యనగర్‌లో కోర్టు ఇంజెక్షన్ ఉన్న భూమిలోకి ఉయ్యూరికి చెందిన పెనుమత్స గౌతం అక్రమంగా ప్రవేశించి కంచె తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతడికి స్థానిక అంగన్వాడీ ఆయా నాగమణి సహకారంతో ఈ ఘటన జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.