ప్రమాదమే మార్గం: 17 రోజుల్లో 29 మంది ప్రాణాలు గాల్లోకి
NLG: ఉమ్మడి జిల్లాలో మళ్లీ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఎక్కడో ఓ చోట ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 రోజుల్లో 29 మంది దుర్మరణం చెందారు. అతివేగం, మద్యం మత్తు, రోడ్ల వెంట వాహనాలు నిలపడమే ఈ ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. రోడ్లపై వాహనాలు నిలపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.