మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన MLA
HNK: ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామంలో రోటరీ క్లబ్ సహకారంతో కుట్టు శిక్షణ పొందిన 10 మంది మహిళలకు కుట్టు మిషన్లను బుధవారం MLA కేఆర్. నాగరాజు పంపిణీ చేశారు. MLA మాట్లాడుతూ.. మహిళలు స్వయం ఉపాధి ద్వారా కుటుంబ, గ్రామాభివృద్ధికి దోహదపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రోటరీ సహకారంతో విద్యార్థులకు బెంచీలు, ఆట వస్తువులు అందజేస్తున్నట్లు MLA తెలిపారు.