'రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిని అభివృద్ధి'
SKLM: అరసవల్లిలోని ఆదిత్యని ఆలయ పరిధిలోని ఇంద్ర పుష్కరిని అభివృద్ధికి మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 21న ఇంద్ర పుష్కరిని ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గురువారం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆలయ ఈవో ప్రసాద్ మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.