కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
AP: కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ భవన్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఇవాళ నాలుగో రోజు పర్యటనలో భాగంగా ఆమె పాలార్ నదికి జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం నాయనూరు గ్రామంలోని మహిళలతో భువనేశ్వరి ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నారు.