కార్డెన్ సెర్చ్.. 10 వాహనాలు సీజ్
విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు ఎయిర్ పోర్ట్, పద్మనాభం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు "కార్డెన్ సెర్చ్" ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని నిశితంగా తనిఖీ చేశారు. అనంతరం సరైన ధృవపత్రాలు లేని 10 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.