VIDEO: చింతలపూడి వాసులకు సీఐ విజ్ఞప్తి
W.G: ప్రజలు దొంగతనాల నివారణలో పోలీసులకు సహకరించాలని చింతలపూడి సీఐ టీ. క్రాంతి కుమార్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేసవిలో విహారయాత్రలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లోని నేతల విగ్రహాలకు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ సభ్యులకు సూచించారు.