‘టూత్‌పేస్ట్, సబ్బుపై 27% పన్ను విధించేవారు’

జీఎస్టీ పన్నులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. '2014కు ముందు టూత్‌పేస్ట్, సబ్బు, వంట నూనె వంటి నిత్యావసర వస్తువులపై 27% పన్ను విధించేవారు. కానీ ఇప్పుడు వాటిపై కేవలం 5% జీఎస్టీ మాత్రమే ఉంది' అని ప్రధాని చెప్పారు. సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు పన్నులను తగ్గించామని ఆయన పేర్కొన్నారు.