అంబేద్కర్ స్మృతివనం అభివృద్ధి పనులపై సమీక్ష
కృష్ణా: విజయవాడ కలెక్టరేట్‌లో శుక్రవారం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ స్మృతివనం అభివృద్ధి పనులపై సమీక్ష జరిగింది. పర్యాటక, సంస్కృతి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా పాల్గొని మాట్లాడారు. స్మృతివనాన్ని మెరుగైన సౌకర్యాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో జాతీయ మైలురాయిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని వారు తెలిపారు