శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. పాతాళగంగలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగాధర మండపం, ఉత్తర మాడవీధి, ఈశాన్య వీధుల్లో భక్తులు దీపాలను వెలిగించి పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మవారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. సాయంత్రం గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణ మహోత్సవం నిర్వహించనున్నారు.