'గత ప్రభుత్వం గంజాయిని ప్రోత్సహించింది'

కృష్ణా: గత ప్రభుత్వం రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో గంజాయిని విచ్చలవిడిగా ప్రోత్సహించిందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయిని చాలా వరకు అరికట్టిందన్నారు. కానీ ఇంకా అక్కడక్కడ వైసీపీ పాలన నుంచి వారసత్వంగా వచ్చిన గంజాయి కొనసాగుతుందని చెప్పారు. దానిని పూర్తిగా అరికడతామని అన్నారు.