జిల్లాలో పెరిగిపోతున్న బాల్య వివాహాల సంఖ్య

జిల్లాలో పెరిగిపోతున్న బాల్య వివాహాల సంఖ్య

NLG: జిల్లాలో బాల్య వివాహాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆడపిల్లలను భారంగా భావించే కొంతమంది తల్లిదండ్రులు 14 ఏళ్లు దాటగానే గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. కొన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నా మిగతా వివాహాలు జరిగిపోతున్నాయి. జిల్లాలో గడిచిన నాలుగేళ్లలో అడ్డుకున్న బాల్య వివాహాల వివరాలు.. 2022-23: 37, 2023-24: 24, 2024-25: 37, 2025-26: 56.