13,597మంది డ్వాక్రా మహిళలకు రూ.9.26 కోట్ల లబ్ధి: ఎమ్మెల్యే

అనకాపల్లి: మాకవరపాలెం మండలానికి YSR ఆసరా నాల్గో విడతలో 13,597 మంది డ్వాక్రా మహిళలకు రూ.9.26 కోట్ల లబ్ది చేకూరిందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. స్థానిక హైస్కూల్లో బుధవారం ఆసరా లబ్ధిదారులకు ఆయన చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్ధికంగా ఎదగాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యనారాయణ పాల్గొన్నారు.