మంత్రి లోకేష్‌కు వివాహ ఆహ్వానం
ASR: తన వివాహానికి హాజరుకావాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖల మంత్రి నారా లోకేశ్‌ను జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆహ్వానించారు. ఈ మేరకు అమరావతిలో లోకేష్‌ను కలిసి మే 13న పాడేరులో జరగనున్న తన వివాహానికి సంబంధించిన తొలి పత్రికను అందజేశారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చినట్లు శ్రావణ్ తెలిపారు.