సత్తెనపల్లిలో రోడ్డు మరమ్మతులు
పల్నాడు: సత్తెనపల్లి పట్టణంలో రహదారి అధ్వాన్నంగా మారి ప్రమాదాలు జరుగుతుండటంపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ఇటీవల జరిగిన ప్రమాదానికి రోడ్డు దుస్థితే కారణమని గుర్తించిన ఆయన, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన యంత్రాంగం యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు ప్రారంభించారు.