నేడు వివిధ వాహనాలకు బహిరంగ వేలం
నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పట్టుబడిన వివిధ వాహనాలకు నేడు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. సుభాష్ నగర్‌లోని ఎక్సైజ్ స్టేషన్‌లో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. వేలంలో పాల్గొనే వారు రూ.5,000 డిపాజిట్ చెల్లించి హాల్ టికెట్ పొందాలని అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ అధికారులు సూచించారు.