'ఆధునిక విద్యా బోధనతో ఉపాధ్యాయులు ముందుకు వెళ్లాలి'
SRCL: ఆధునిక బోధన వ్యూహాలతో ఉపాధ్యాయులు ముందుకెళ్లాలని చందుర్తి మండల విద్యాధికారి వినయ్ కుమార్ సూచించారు. మర్రిగడ్డ ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఆయన "ధర్మ టీచర్స్ యూనిటీ క్యాలెండర్"ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పూలే దంపతుల ఆదర్శాలతో ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.