VIDEO: కీసర రహదారి పక్కన చెలరేగిన మంటలు
NTR: కంచికచర్ల(M) కీసర గ్రామ శివారులో రహదారి పక్కన గురువారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి దట్టమైన అగ్నికీలలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి ఫైర్ ఇంజన్‌ను తీసుకువచ్చి సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.