మాచవరంలో బ్యానర్‌తో బస్ స్టాప్ మూసివేత.!
NTR: మాచవరంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద బ్యానర్ కారణంగా బస్ స్టాప్ పూర్తిగా మూసుకుపోయింది. ఇప్పటికే ఎండలు తీవ్రంగా ఉండగా, బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు షెల్టర్‌లోకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు వినియోగించే ఈ బస్ స్టాప్ వద్ద బ్యానర్ ఏర్పాటు చేయడం వల్ల నిలబడటానికి కూడా స్థలం లేకుండా పోయిందని ప్రజలు మండిపడుతున్నారు.