వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
MNCL: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో 'అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం- 2025' గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ఈనెల 19 వరకు వృద్ధుల వారోత్సవాలు కొనసాగుతాయన్నారు. పోషణ, ఇతర ఫిర్యాదుల కోసం హెల్ప్ లైన్ నం.14567ను వినియోగించుకోవాలన్నారు.