ఉచిత సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ ప్రారంభం
సత్యసాయి: కదిరి రూరల్ మండలం సున్నపుగుట్ట తాండాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు మంజూరైన ఉచిత సోలార్ ప్యానెల్స్‌ను ఆయన పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 1750 మందికి ఈ లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు.