వరుణుడి కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

KRNL: వరుణుడి కోసం మంగళవారం పెద్దకడబూరులోని గ్రామ దేవతలకు.. ఆ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో తెచ్చిన తుంగభద్ర నది జలాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని శ్రీ మారెమ్మ అవ్వ, కొరవంజమ్మ అవ్వ, దేవమ్మ, పెద్ద లక్ష్మమ్మ, చిన్న లక్ష్మమ్మ, సుంకలమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వరుణుడిని ప్రసాదించాలని కోరారు. అనంతరం తుంగభద్ర నది జలాలతో గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు.