కొత్తవలసలో అక్రమంగా గ్యాస్ సిలిండర్ల నిల్వ
VZM: కొత్తవలస మేజర్ పంచాయతీ కార్యాలయం దగ్గర ఉన్న టీ కొట్టులో డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లై) చిరంజీవి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మూడు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, స్థానిక గ్యాస్ ఏజెన్సీస్‌కి తరలించారు. ఆనంతరం అతనిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇంకోసారి పట్టుబడితే సిలిండర్లు రద్దు చేస్తామన్నారు.