VIDEO: 'ఆసుపత్రి నిర్మాణం పనులు వేగంగా చేపట్టాలి'
WNP: పెబ్బేరు మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి స్థలంతో పాటు నిర్మాణ మ్యాప్‌ను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.