'మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి'
AKP: మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమం కోసం మత్స్యకార కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మత్స్యకార సంక్షేమ సంఘాల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు విజ్ఞప్తి చేశారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెంలో మత్స్యకారులు ర్యాలీ నిర్వహించారు. ముత్యాలు మాట్లాడుతూ.. మత్స్యకారులకు తగిన గుర్తింపు కల్పించాలన్నారు.