'రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి'

NGKL: చారకొండ నుంచి మర్రిపల్లి వరకు ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రోడ్లు గుంతలమయంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని రోడ్డు నిర్మాణ పనులతోపాటు రోడ్డును వెడల్పు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.