నల్లబ్యాడ్జీలతో రోడ్డెక్కిన బీఆర్‌ఎస్ నేతలు
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో సిట్ విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు.