రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
PPM: కురుపాం మండలం పెదగొత్తిలి గ్రామంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం రైతు ఫోటో, ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌తో పాస్ పుస్తకాలు జారీ చేయడం వల్ల రైతులకు గౌరవం, భరోసా పెరిగిందన్నారు.