VIDEO: నాగమయ్య విగ్రహాల ధ్వంసం
PLD: వినుకొండ మండలం విఠంరాజుపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. గుంటూరు-కర్నూలు రహదారి పక్కన ఉన్న నాగమయ్య మందిరంలో విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగులు మద్యం మత్తులోనే ఈ దారుణానికి పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.