'దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి'

'దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి'

కోనసీమ: దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మలేరియా అధికారి నక్క వెంకటేశ్వరరావు అన్నారు. అయినవిల్లి పీహెచ్సీ పరిధిలోని ఇటీవల డెంగ్యూ బారిన పడిన బాధితుడిని ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమల ద్వారా సంక్రమించే వివిధ వ్యాధుల పట్ల ప్రజలందరూ జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.