ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆశాల ర్యాలీ
MBNR: జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాత ఆసుపత్రి ప్రాంతంలో జరిగిన ఈ ర్యాలీలో DMHO డాక్టర్ కృష్ణ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారానే వ్యాధులను దరిచేరకుండా చూసుకోవచ్చని సూచించారు.