VIDEO: 'నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తాం'
RR: హయత్ నగర్ డివిజన్‌లోని ముదిరాజ్ కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను కార్పోరేటర్ నవజీవన్ రెడ్డి పరిశీలించారు. కాలనీలో మిగిలిన వీధుల్లో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని కాలనీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయించి, త్వరలోనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.