అల్లాదుర్గం నూతన ఎంపీడీవోగా వేద ప్రకాశ్ రెడ్డి
MDK: అల్లాదుర్గం నూతన MPDOగా చిల్పూరి వేద ప్రకాశ్ రెడ్డి నియమితులయ్యారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో భాగంగా గ్రూప్-1 ఉద్యోగం సాధించి అల్లాదుర్గం మండల MPDOగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనను కార్యాలయ సిబ్బంది శాలువాతో సన్మానించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తానన్నారు.