వైభవంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం
PDPL: ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సాంబమూర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు, ఆచార కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. దేవాలయ కమిటీ ఛైర్మన్, సభ్యులు, సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు గ్రామస్తులు వేడుకల్లో పాల్గొని ఉత్సవాన్ని మరింత వైభవంగా జరిపారు.