బందపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం

బందపల్లిలో ప్రజా దర్బార్ కార్యక్రమం

SKLM: మెలియాపుట్టి మండలం బందపల్లి పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొని, ప్రజల సమస్యలకు తక్షణ స్పందన తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.