రామాలయానికి రూ.50 వేలు విరాళం

రామాలయానికి రూ.50 వేలు విరాళం

VZM: నెల్లిమర్ల మండలం సతివాడ రామాలయానికి ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగార్రాజు రూ.50 వేలు విరాళం అందించారు. భోగాపురం మండలం పోలిపల్లిలో ఆలయ కమిటీ సభ్యులకు కర్రోతు ఈ మొత్తాన్ని సోమవారం అందించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని కర్రోతు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరాడ శ్రీను, రెల్లి వెంకటేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.