కౌతాళంలో తాగునీటి సంక్షోభం

కౌతాళంలో తాగునీటి సంక్షోభం

KRNL: కౌతాళం మండల కేంద్రంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. సుమారు 20 వేల జనాభాకు ఒక్క OHSR ట్యాంక్ మాత్రమే ఉందిని స్థానికులు అన్నారు. చెరువు నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారని, 12 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయని తెలిపారు. 6 వేల జనాభా ఉన్న సమయంలో నిర్మించిన ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని, కొత్త ట్యాంకులు నిర్మించాలని కోరుతున్నారు.