రేపు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ

రేపు మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ

ELR: ఉంగుటూరు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్పంచులు, ఉపసర్పంచులు, కార్యదర్శులకు శిక్షణా తరగతులు జరుగుతాయని ఎంపీడీవో మనోజ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. మండలంలోని సర్పంచులు, కార్యదర్శులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.