మంగమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే

మంగమ్మను పరామర్శించిన ఎమ్మెల్యే

KMM: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన భూక్య మంగమ్మ ఇటీవల ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మంగళవారం మంగమ్మను పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందేలా చూస్తానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.