'కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి'

SRD: కాంటాక్ట్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో కాంట్రాక్ట్ కార్మికులతో శుక్రవారం సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనేక పరిశ్రమలు కాంట్రాక్ట్ కార్మికులతో వెట్టిచాకిరి చేస్తున్నారని ఆరోపించారు. 12 గంటలు పని చేయించుకుంటున్నారని విమర్శించారు.