శీతల గంగమ్మకు ప్రత్యేక పూజలు

KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 పంచాయతీ పార్వతీపురం గ్రామంలో వెలసిన శ్రీ శీతల గంగమ్మ అమ్మవారికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగమ్మ వేకువ జామునే అమ్మవారి మూలవిరాట్టుకు పలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.