ఈ నెల 31కి గడువు ముగుస్తుంది: ఈఈ
CTR: స్వచ్ఛంద అదనపు విద్యుత్ లోడ్ చెల్లింపులకు ఈ నెల 31కి గడువు ముగుస్తుందని పుంగనూరు విద్యుత్ శాఖ EE సత్యనారాయణమూర్తి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వినియోగదారులకు ప్రభుత్వం మంచి సదవకాశాన్ని కల్పించినట్లు చెప్పారు. అదనపు లోడ్‌కు చెల్లించాల్సిన మొత్తంలో రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.