VIDEO: ఆంజన్న సన్నిధిలో పుట్టపర్తి ఎమ్మెల్యే
సత్యసాయి: పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి శుక్రవారం కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రాజగోపుర శిఖరంపై కలశం ప్రతిష్ట కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే సింధూర రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు.