క్షణంలో అంతా మారిపోయింది!

క్షణంలో అంతా మారిపోయింది!

చేవెళ్ల ప్రమాదంలో ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం 19 మంది కుటుంబాలను తీరని శోకసంద్రంలో నింపింది. అమ్మా! అనే ఒక్క అరుపు కూడా పూర్తిగా బయటకు రాకుండా.. కంకర వాళ్లను సజీవ సమాధి చేసింది. బస్సులో పది నెలల పసి బిడ్డను పక్కన పెట్టుకున్న తల్లి, ఉదయం హడావిడిగా ఆఫీసుకు బయలుదేరిన ఉద్యోగులు, భవిష్యత్‌ గురించి ఆలోచిస్తూ ప్రయాణిస్తున్న విద్యార్థులు.. కానీ ఆ ఒక్క క్షణం అంతా మారిపోయింది.