'2027 గోదావరి పుష్కరాల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు'
JGL: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం, పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు, పుష్కరాల కమిటీ సభ్యులు పేర్కొన్నారు. వెల్గటూర్ మండలం కోటిలింగాలలో శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానాన్ని ప్రభుత్వం నియమించిన పుష్కరాల కమిటీ సభ్యులు సందర్శించారు. పుష్కరాల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లు, ప్రత్యేకించి పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతులపై చర్చించారు.