బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత: ఎమ్మెల్యే
NTR: బాలికల విద్యకు రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు స్పష్టం చేశారు. మైలవరం పట్టణంలో పీఎంఏజెఏవై నుంచి ముంజూరైన రూ. 3కోట్ల నిధులతో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఏపీకి కొత్తగా హాస్టళ్లను మంజూరు చేసిందన్నారు.